కాలేజీల బంద్ కొనసాగిస్తాం: ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్

58చూసినవారు
కాలేజీల బంద్ కొనసాగిస్తాం: ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్
TG: ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 8న సభ, 11న 10 లక్షల మంది విద్యార్థులతో నిరసన చేపడతామని తెలిపింది. తమ డిమాండ్స్‌ను నెరవేర్చేవరకు బంద్‌ కొనసాగుతుందని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్ రమేశ్ నాయుడు తెలిపారు. ప్రభుత్వం మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తమకు రావాల్సిన బకాయిల్లో సగం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్