TG: వెలుగుమట్ల, రాయగిరి
ఆర్ఆర్ఆర్ సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ అంశాలపై సమగ్ర వివరాలతో వినతిపత్రం సమర్పించామని, తమ వినతులపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలను బట్టి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని కవిత స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులు, భూసేకరణ బాధితులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని అన్నారు.