ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తామని, నరకానికి పంపిస్తామని తేల్చిచెప్పారు. మంగళవారం జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు ఉంటాయని, ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా ఈ యుద్ధం నిరోధించిందని, పశ్చిమాసియాలో ఆధిపత్య శక్తిగా ఇరాన్ స్థానాన్ని అంతం చేసిందని పేర్కొన్నారు.