ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ విషమంగా మారుతున్నాయి. ఇరాన్ మిస్సైల్ దాడులకు ప్రతిస్పందనగా, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ భూమిపై ఉండే అర్హత లేదని, ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలన్న వ్యక్తి ప్రాణాలతో ఉండకూడదని అన్నారు. అతన్ని అంతమొందించేందుకు ఇప్పటికే ఐడీఎఫ్ దళాలకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.