TG:
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో తమను అడ్డుకునే ప్రయత్నం చేసినా భయపడేది లేదని, తాము తప్పకుండా కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ స్పష్టం చేశారు. పెంబర్తి వద్ద పోలీసులు హైవేపై బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వృథాగా పోతున్న లక్ష క్యూసెక్కుల నీటిని రైతులకు చూపిస్తామని అన్నారు. నీటిని ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెట్టే కుట్రను రేవంత్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని ప్రజల ముందు ఎండగడతామని
కేటీఆర్ పేర్కొన్నారు.