
లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లో శ్రీలీల..?
టాలీవుడ్లో అందం, అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్న శ్రీలీల, ఇప్పుడు వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఫీ మేల్ సెంట్రిక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌లో భాగ్య శ్రీ బోర్సే పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరితో వైజయంతీ మూవీస్ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఈ చిత్రానికి 'చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.




