TG: ఆర్&బీ శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. R&B ఇంజినీర్స్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఫీల్డ్‌లో ఉండే ఏఈలకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని చెప్పారు. అలాగే పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. తమ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమన్నారు. తర్వాత ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.