TG: మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని సీఎం రేవంత్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. 'ఫస్ట్ ఫేజ్‌లో గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కి.మీ. అభివృద్ధి చేస్తాం. వచ్చే మూడు నెలల్లో అంచనాలు ఫైనల్ చేస్తాం. ADB బ్యాంకు రూ.4,100 కోట్ల రుణం ఇస్తుంది. కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది. వచ్చే నాలుగైదు రోజుల్లో అన్ని వివరాలు బయటకు చెబుతాం' అని తెలిపారు.