
మాట నిలబెట్టుకున్న టీటీడీ.. వృద్ధురాలికి వీఐపీ దర్శనం (వీడియో)
AP: టీటీడీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. 116 ఏళ్ల వృద్ధురాలికి వీఐపీ దర్శనం కల్పించింది. తమిళనాడుకు చెందిన వృద్ధురాలు నవనీతమ్మ తిరుమల కొండెక్కిన విషయం తెలిసిందే. ఆమె భక్తికి సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఫిదా అయ్యారు. విజిలెన్స్ అధికారుల ద్వారా ఆమె ఆచూకీ కనుగొని, సోమవారం ఉదయం నవనీతమ్మతోపాటు ఆమె కుటుంబ సభ్యులకు దగ్గరుండి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు.




