TG: రాష్ట్రంలో మూడు విడతలుగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో రూ. 2.37 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కాంగ్రెస్ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తోందన్నారు. మరో ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుదని తెలిపారు.