
19 ఏళ్ల అమ్మాయిని రూ.10 లక్షలకు అమ్మేసిన తల్లి.. ఎందుకంటే!
ఉత్తరప్రదేశ్లో 19 ఏళ్ల అమ్మాయిని సొంత తల్లే రూ.10 లక్షలకు విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, తల్లి, ఇద్దరు అక్కలు కలిసి తనను వ్యభిచారంలోకి దింపారని, ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టారని వాపోయింది. డబ్బు కోసం తరచూ వేధింపులకు గురి చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.




