ఢిల్లీలో బుధవారం జరిగిన ఇండి కూటమి సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు సేవ్ డెమొక్రసీ మార్చ్ నిర్వహిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో మార్చ్ ఉంటుంది ఏఐసీసీ చీప్ ఖర్గే తెలిపారు. కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు చేస్తాం. అక్టోబర్ 6న సీఈసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఎంపీలంతా కలిసి సీఈసీ ఆఫీస్‌ను ముట్టడిస్తాం. OCT 2వ వారంలో రాష్ట్రపతిని కలుస్తాం. ఈసీని
మోదీ, అమిత్ షా తోలుబొమ్మలా వాడుతున్నారు. అందుకే ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐదు భారీ సభలు నిర్వహిస్తాం. NOV1న ఢిల్లీలో భారీ సభ నిర్వహిస్తాం' అని తెలిపారు.