రైతుల భూములపై టాక్స్ విధానాన్ని తీసుకొస్తాం: మంత్రి పొంగులేటి

0చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం ఖజానా నింపేందుకు రైతులపై మరో పన్ను భారం మోపేందుకు సిద్ధమవుతోంది. వ్యవసాయ భూములపై 'భూమి శిస్తు' పేరుతో పన్ను విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ మేరకు భూమి శిస్తు విధివిధానాల ఖరారుపై త్వరలోనే ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, భూకబ్జాలను తగ్గించడానికే భూమి శిస్తు తీసుకొస్తున్నామని, భూమి ఎవరెవరి ఆధీనంలో ఉందో తెలుసుకోవడానికే ఈ శిస్తు అని, దీనివల్ల భూ ఆక్రమణలు తగ్గి, అసలైన యజమానులకే భూ హక్కులు లభిస్తాయని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్