గతేడాది జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన పైలట్ సుమిత్ సభర్వాల్ మేనల్లుడు, కెప్టెన్ వరుణ్‌కు విచారణకు హాజరు కావాలని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నోటీసులు జారీ చేసింది. ఈ చర్యను పైలట్స్ ఫెడరేషన్ (FIP) తీవ్రంగా ఖండించింది. ప్రమాదంతో సంబంధం లేని వ్యక్తిని విచారణకు పిలవడం వేధింపుతో సమానమని పేర్కొంటూ, FIP, AAIBకి లీగల్ నోటీసులు పంపింది.