TG: ఫాతిమా కాలేజీ అంశంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఓ సమావేశంలో మాట్లాడుతూ.. 'మా విద్యసంస్థలను కూల్చివేస్తామంటున్నారు. విద్యా సంస్థలను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఒక సంస్థను కూల్చేస్తే వంద విద్యా సంస్థలు కడతాం. మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. మీ బెదిరింపులకు మేం లొంగం. ఇలాంటి బెదిరింపులు చాలానే చూశాం' అని వ్యాఖ్యానించారు.