
హైదరాబాద్‌లో కోటి విలువైన డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్‌లో రూ.కోటి విలువైన డ్రగ్స్‌ను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి ఎస్వోటీ, కీసర పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 7 కిలోల ఓపీఎం, 2 కిలోల పాపిస్ట్రా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేయగా, మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.




