TG: నిర్మాణం పూర్తయిన 1.80 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు 15 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శనివారం జనగామ పర్యటనలో మాట్లాడుతూ.. కేంద్రం ఇంటికి రూ.72వేలు ఇస్తామని చెప్పి, పదేపదే అడిగిన తర్వాత ఇటీవల 2 లక్షల ఇళ్లకు మంజూరు చేసిందన్నారు. గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లకు రూ.2-3 లక్షలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.