ప్రతిపక్ష పాత్ర బలంగా పోషిస్తాం: కేటీఆర్‌ (వీడియో)

18368చూసినవారు
TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై కేటీఆర్ స్పందించారు. ఈ ఫలితం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ మాత్రమే రాజకీయ ప్రత్యామ్నాయమని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. 'గెలుపోటములు సహజం. ముందుకు పోదాం, కార్యకర్తలు సన్నద్ధం కావాలి. మరింత బలంగా పనిచేద్దాం. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకూ శ్రమిద్దాం' అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్