సీఎం రేవంత్ ఏ మంచి పని చేసినా మేము ప్రశంసిస్తాం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి(వీడియో)

6చూసినవారు
TG: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ఏ మంచి పని చేసినా తామంతా ప్రశంసిస్తామని, అన్ని విధాలా సహకరిస్తామని ఆయన అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణం విషయంలో సీఎం రేవంత్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని కితాబిచ్చారు. తమ నియోజకవర్గానికి యంగ్ ఇండియా స్కూల్ ఇచ్చినందుకు మునుగోడు ప్రజల తరపున రేవంత్ కి ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్