వికసిత్
భారత్ 2047 లక్ష్య సాధనకు యువతే కీలకమని ప్రధాని నరేంద్ర
మోదీ అన్నారు. 2014కు ముందు దేశంలో కేవలం 400 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం వాటిని 800కి పెంచామని తెలిపారు. దేశానికి యువతే అతిపెద్ద శక్తి అని, వారే తమ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత కోచింగ్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో 350కి పైగా విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయని కూడా ఆయన తెలిపారు.