మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. 2026 జనవరి 1న సాయుధ పోరాటం ఆపేస్తామని, ఆరోజు అందరం లొంగిపోతామని MCC జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల చేసింది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగిపోవడం, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ బలహీనపడింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.