జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం: నిరుద్యోగులు(వీడియో)

18చూసినవారు
TG: రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని హైదరాబాద్ లో కొద్ది రోజులుగా నిరుద్యోగులు నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఆదివారం కూడా పలువురు నిరుద్యోగులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. తమని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని రాహుల్ గాంధీ మాటిచ్చి, ఇప్పటి వరకు అడ్రస్స్ లేడని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్