తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్‌రైస్‌ మిల్లులకు తరలిస్తాం: మంత్రి ఉత్తమ్

50చూసినవారు
తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్‌రైస్‌ మిల్లులకు తరలిస్తాం: మంత్రి ఉత్తమ్
TG: పెద్దపల్లి జిల్లాలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష జరిపారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ ధాన్యాన్ని బాయిల్డ్‌రైస్‌ మిల్లులకు తరలిస్తామని వెల్లడించారు. తడిసిన ధాన్యం వల్ల మిల్లర్లకు నష్టం ఉంటే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. చివరిగింజ వరకూ ధాన్యం కొనుగోళ్లు చేస్తామని, ఇసుక లారీలను ధాన్యం తరలించేందుకు వినియోగించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్