హైదరాబాద్ కంటోన్మెంట్‌లోని అత్యంత కట్టుదిట్టమైన ఆర్మీ స్థావరంలో ఆయుధాల చోరీ కలకలం రేపుతోంది. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు భద్రపరిచే గది తాళం పగులగొట్టి 12 ఆయుధాలను దుండగులు ఎత్తుకెళ్లారు. 4 ఏకే-47లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రి చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. చోరీకి గురైన ఆయుధాల విలువ సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుందని అంచనా.