AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ మండలం చీకలబయలు గ్రామానికి చెందిన యువతి (24)కి కలికిరి మండలానికి చెందిన ప్రకాష్‌తో పెళ్లి ఫిక్స్ అయింది. ఈ నెలలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రకాశ్ డీఎస్సీ పరీక్ష రాయగా.. టీచర్ ఉద్యోగం వచ్చింది. దాంతో యువతిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. మనస్తాపానికి గురైన యువతి ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.