నెలలో పెళ్లి.. తొక్కిసలాటలో ఇద్దరూ చనిపోయారు

52979చూసినవారు
నెలలో పెళ్లి.. తొక్కిసలాటలో ఇద్దరూ చనిపోయారు
తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కాబోయే జంట మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఆకాశ్(24), గోకులశ్రీ(24) ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే నెలలో పెళ్లి కూడా ఫిక్స్ అయింది. హీరో విజయ్‌కు ఆకాశ్ వీరాభిమాని. నిన్న సభకు విజయ్ వస్తున్నారని తెలిసి కాబోయే భార్యతో కలిసి ఆకాశ్ వెళ్లాడు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఇద్దరూ మృతి చెందారు.

సంబంధిత పోస్ట్