పెళ్లింట విషాదం.. వడదెబ్బతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత

50చూసినవారు
పెళ్లింట విషాదం.. వడదెబ్బతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వడదెబ్బ కారణంగా ఆర్టీసీ కండక్టర్ మృతి చెందడంతో విషాదం నెలకొంది. పరకాల డిపోకు చెందిన బిరెల్లి శంకర్ (50) భద్రాచలం నుంచి హనుమకొండ వెళ్తున్న బస్సులో విధులు నిర్వహిస్తుండగా అనిశెట్టిపల్లి బ్రిడ్జి వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రయాణికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో కూతురి వివాహ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో పెళ్లి సందడి కాస్త విషాదంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్