రేవంత్ రెడ్డిని ప్రశంసించిన కోమటిరెడ్డి

3451చూసినవారు
రేవంత్ రెడ్డిని ప్రశంసించిన కోమటిరెడ్డి
TG: సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన పాలనను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసించారు. రేవంత్ రెడ్డి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాలేశ్వరం, ధరణి పేరుతో దోపిడీ చేసిందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్