పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. మోడీ అధ్యక్షతన అత్యున్నత భద్రతా సమావేశం

39చూసినవారు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. మోడీ అధ్యక్షతన అత్యున్నత భద్రతా సమావేశం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆదివారం రాత్రి అత్యున్నత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశం జరగనుంది. తమిళనాడు పర్యటన అనంతరం ఢిల్లీ చేరుకున్న ప్రధాని, సేవాతీర్థ్‌లో ఈ కీలక సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతతో పాటు, పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్