దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల,
అమెరికా వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ఐటీ, రియాల్టీ, ఆటో స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా వరుసగా మూడో రోజు సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 373.93 పాయింట్లు కోల్పోయి 76,570.35 వద్ద, నిఫ్టీ 141.35 పాయింట్లు పతనమై 23,914.45 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.97గా ఉంది.