390 పరుగుల వద్ద విండీస్ ఆలౌట్.. భారత్ లక్ష్యం 121

14968చూసినవారు
390 పరుగుల వద్ద విండీస్ ఆలౌట్.. భారత్ లక్ష్యం 121
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు కుల్దీప్, బుమ్రా చెరో మూడు వికెట్లు తీయగా, వెస్టిండీస్ ఓపెనర్ క్యాంప్‌బెల్, షై హోప్ సెంచరీలు చేశారు. దీంతో టీమ్‌ ఇండియాకు విజయానికి 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన భారత్‌ ఇప్పుడు చిన్న లక్ష్యాన్ని చేధించి సిరీస్‌ విజయాన్ని సాధించేందుకు సిద్ధమవుతోంది.

సంబంధిత పోస్ట్