
మరింత ఆసక్తి పెంచుతున్న రాజు గారి గది - 4 పోస్టర్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'రాజు గారి గది 4 శ్రీచక్రం' సినిమా దసరా కానుకగా 2026న విడుదల కానుంది. ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్-కామెడీ చిత్రం 'మిరాయ్' వంటి భారీ విజయం తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. 'రాజు గారి గది' సిరీస్ లో నాలుగో భాగంగా ఈ చిత్రం వస్తుందని 'ఎ డివైన్ హారర్ బిగిన్స్' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తుండటంతో అంచనాలు పెరిగాయి. దసరా సందర్బంగా విడుదలైన పోస్టర్ మరింత ఆసక్తి పెంచింది.




