జాతర సమయంలో ఎన్నికలేంటి?.. బీఆర్ఎస్ అభ్యంతరం

34చూసినవారు
జాతర సమయంలో ఎన్నికలేంటి?.. బీఆర్ఎస్ అభ్యంతరం
TG: మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది, ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే నిన్న షెడ్యూల్ ప్రకటించి, ఇవాళ నోటిఫికేషన్ వెలువరించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాస్తూ, మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగా లేక అధికార పార్టీ కుట్రా అని ప్రశ్నించారు. షెడ్యూల్, నోటిఫికేషన్ మధ్య ఒక్క రోజు కూడా గడువు ఇవ్వకపోవడం దారుణమని, మేడారం జాతరను ఎన్నికల సంఘం విస్మరించిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్