వ్యక్తిగత ఛానెళ్లు ప్రారంభించి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కంటెంట్ తొలగించేలోపే నష్టం జరిగిపోతుందని, సోషల్ మీడియా కంటెంట్ ను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆన్ లైన్ లో అభ్యంతరకరమైన కంటెంట్ నియంత్రణకు వయస్సు, ఆధార్ వివరాలు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టాలని, స్వతంత్ర సంస్థ అవసరమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను కోరింది. నిబంధనలు తీసుకురావడానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.