
అమెరికా ద్వంద్వ వైఖరిపై జైశంకర్ ఆగ్రహం
చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆసియాన్ సదస్సులో మాట్లాడుతూ, అమెరికా 'సెలక్టివ్'గా నిబంధనలు వర్తింపజేస్తోందని, నీతులు చెప్పేవారు ఆచరణలో భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై సుంకం విధిస్తూ, చైనా, యూరప్లపై చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావించారు. ఇంధన మార్కెట్లు కుచించుకుపోతున్నాయని, కొందరికే నిబంధనలు వర్తింపజేయడం సరికాదని జైశంకర్ అన్నారు.




