ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఇంధన పరివర్తన సూచిక-2025లో భారత్ 71వ స్థానంలో నిలిచింది. ఇంధన భద్రత, స్థిరత్వం, సమానత్వంలో పనితీరు ఆధారంగా 118 దేశాలతో డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన ఈ సూచికలో స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్‌లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.