కావాల్సింది సారీ కాదు.. న్యాయం: విజయ్ (వీడియో)

64చూసినవారు
తమిళనాడులో అజిత్‌ కుమార్‌ అనే సెక్యూరిటీ గార్డు కస్టడీ మరణం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీవీకే పార్టీ అధినేత, సినిమా హీరో విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి తమకు కావాల్సింది సారీ కాదని, న్యాయం అని పేర్కొన్నారు. స్టాలిన్ హయాంలో మొత్తం 24 మంది కస్టడీలో మరణించారని, అజిత్‌ కుటుంబానికి ఇచ్చినట్లే ఆ బాధిత కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలని విజయ్‌ డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్