చాలాకాలంగా వాట్సాప్ డీపీ మార్చని వారి వెనుక ఉన్న మానసిక ధోరణులను గురించి నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొందరు ఇతరుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మరికొందరు స్థిరత్వాన్ని ఇష్టపడటం, ఇంకొందరు ఆ ఫోటోను ఒక జ్ఞాపకంగా భావించడం వంటి కారణాలు ఉండవచ్చు. డీపీ మార్చని వారందరూ ఇంట్రోవర్ట్లు అని చెప్పలేమని, ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి వారి ప్రవర్తన, ఆలోచనా విధానం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.