పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే మార్గమేంటి?.. రాజ్యాంగం ఏం చెప్తోంది? అనే ప్రశ్న దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఎన్నికల్లో మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం రాజీనామా చేయకపోతే రాజ్యాంగపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం గవర్నర్ చెప్పిన కాలం వరకు సీఎం పదవిలో ఉంటారు. అయితే ఎన్నికల్లో మెజారిటీ కోల్పోతే ఆ ప్రభుత్వం నైతికంగా అధికారంలో ఉండే హక్కు కోల్పోతుంది. సీఎం స్వచ్ఛందంగా వైదొలగకపోతే గవర్నర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవచ్చు.