"మదర్స్ డే" నేపథ్యం ఏంటి? అని చాలా మందికి డౌట్ ఉంటుంది. వేడుకలకు ఆధునిక రూపం తీసుకురావడంలో అన్నా జార్విస్ కీలక పాత్ర పోషించారు. తన తల్లి సేవలను స్మరించుకుంటూ, ప్రపంచంలోని తల్లులందరి త్యాగాలను గుర్తించాలని ఆమె ఉద్యమించారు. ఆమె కృషి ఫలితంగా 1914లో అమెరికా ప్రభుత్వం మే నెల రెండో ఆదివారాన్ని అధికారికంగా మాతృ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి మదర్స్ డే సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, తల్లిప్రేమకు ప్రతీకగా ప్రతి ఏడాది ఘనంగా జరుపుకుంటున్నారు.