SBI బ్రాంచ్ మేనేజర్ అలోక్ కుమార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫీసులో పనిచేస్తుండగా ఓ మహిళ ఆయన చుట్టూ తిరుగుతూ ‘సారా సారా దిన్ తుం కామ్ కరోగే తో ప్యార్ కబ్ కరోగే’ పాటకు రీల్ డ్యాన్స్ చేసింది. వీడియోలో డెస్క్‌పై ఫైల్స్, వెనుక అవార్డులు కనిపించాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్‌లు "వర్క్ హాలిజమ్ వర్సెస్ రొమాన్స్" అని, “బ్రదర్ త్వరలో సస్పెండ్ అవుతాడు”, “పబ్లిక్ ఆఫీసులు ఎంటర్‌టైన్మెంట్ కోసంనా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.