చెరకు సాగులో రైతులు స్వల్పకాలిక రకాలను 40 శాతం, మధ్య, దీర్ఘకాలిక రకాలను 60 శాతం నాటుకుంటే పంట ఒకేసారి పక్వతకు రాకుండా దఫదఫాలుగా కోతకు వస్తుంది. నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే, పూత పూయని రకాలు లేదా 7-8 నెలల వయస్సు గల లేత తోటల నుంచి విత్తనాన్ని సేకరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలని వారు తెలిపారు.