TG: రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతుభరోసా నిధులను విడుదల చేసింది. కొన్ని గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. డబ్బులు పడని రైతులు తమ పట్టాదారు పాస్ బుక్, భూమి వివరాలు చెక్ చేసుకోవాలి. పట్టాదారు పాస్ బుక్ లో, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్‌లో పేరు ఒకేలా ఉందా.. లేదా అనేది సరి చూసుకోవాలి. ఇక ఆధార్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వంటివి లింక్ చేశారా లేదా చెక్ చేస్కోవాలి. డబ్బులు అకౌంట్లో పడకపోతే మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.