నాగచైతన్యతో విడాకుల తర్వాత హీరోయిన్ సమంత సినిమాలకు ఏడాది విరామం ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించినప్పుడు.. ఆసిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడిమోరుతో స్నేహం మొదలయ్యింది. అది కాస్తా ప్రేమగా మారినట్టు సమాచారం. వీరిద్దరూ కలిసి పలు సందర్భాల్లో కనిపించడం, సమంత రాజ్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. వీరి బంధంపై ఇండస్ట్రీలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి.