బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్‌' 5వ సీజన్ ఎప్పుడు?

11574చూసినవారు
బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్‌' 5వ సీజన్ ఎప్పుడు?
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్‌' టాక్ షో ఆహా ఓటీటీలో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. చివరి సీజన్ 2024 అక్టోబర్‌ 25న ప్రారంభమై 2025 జనవరి వరకు కొనసాగింది. అయితే, ఐదో సీజన్ గురించి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా, సినిమాలతో బిజీగా ఉండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం 'దాదా' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న బాలకృష్ణ, కాలు గాయం నుంచి కోలుకున్నారు.

సంబంధిత పోస్ట్