ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న భాద్రపద అమావాస్య రోజున జరగనుంది. ఇది భారత్‌లో కనిపించకపోయినా, న్యూజిలాండ్, ఫిజి, అంటార్కిటికా, ఆస్ట్రేలియా దక్షిణ ప్రాంతాల్లో వీక్షించవచ్చు. రాత్రి 11:00 గంటలకు ప్రారంభమై, అర్థరాత్రి 3:23కి ముగిస్తుంది. ఈ గ్రహణం కన్యా రాశి, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంభవిస్తుంది. గ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యారాశిలో ఉంటారు.