దేశవ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ 21వ విడత నిధులు త్వరలో జమ కానున్నాయి. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. దీని కోసం కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నవంబర్ మొదటి వారంలో ఈ నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం. e-KYC పూర్తి చేసుకుని, ఆధార్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన వారికే డబ్బులు జమ కానున్నాయి.