TG: రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కొత్త దరఖాస్తులు తీసుకోకపోవడంతో వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. అలాగే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌లు పెంచి ఇవ్వాలని ఇప్పటికే తీసుకుంటున్న వారు విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందైనా పింఛన్లపై ప్రకటన చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.