గుజరాత్‌లోని కచ్‌లో ఖావ్‌డా వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ రూపుదిద్దుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) చేపట్టిన ఈ ప్రాజెక్టు, సుమారు 700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విండ్ అండ్ సోలార్ ఎనర్జీ కోసం నిర్మించబడుతోంది. 30 GW సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ హైబ్రీడ్ పార్క్, 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతున్న క్రమంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది.