క్యాన్సర్‌తో బాధపడుతున్న 9 ఏళ్ల కొడుకు హర్షను బతికించుకోవడానికి యూట్యూబ్ రీల్స్‌లో చూసిన మనోనాధామ్ బావి నీళ్ల కోసం తండ్రి పాలది శ్రీహరి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. ఇప్పటికే కోటిన్నరకుపైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో, కొడుకును రక్షించుకోవాలన్న తపనతో తిరుపతి నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మనోనాధామ్‌కు బయలుదేరారు. అయితే, అక్కడికి వెళ్లే మార్గమధ్యంలో, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో హర్ష అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తండ్రికి గాయాలయ్యాయి.